లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదు : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన విలేకరులు పార్టీ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశం ఎక్కువ కాలం లాక్ డౌన్ లో ఉన్న ఈ సమయంలో రాహుల్ ప్రసంగించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ముఖ్యంగా ఈ కీలకమైన సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ సమయంలో తాను ప్రభుత్వంపై విమర్శలు కాకుండా సూచనలు చేయబోతున్నట్లు ప్రకటించారు. అదేమంటే.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ప్రభుత్వానికి మా నిర్మాణాత్మక సలహా అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. కోవిడ్ -19 కోరనా వైరపస్ పై ప్రభుత్వం స్పందించడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వం పరీక్షలను వేగవంతం చేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ‘తాను భారతదేశం, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో నిపుణులతో మాట్లాడుతున్నానని… లాక్ డైన్ కరోనా వైరస్ వ్యాప్తికి ఏ విధంగానూ పరిష్కారం కాదని.. ఇది విరామం వంటిది అని.. కాబట్టి దాని నుంచి పూర్తి విముక్తి ఉంటే కానీ పరిష్కారం దొరకదని రాహుల్ గాంధీ వివరించారు.

అదేవిధంగా లాక్ డౌన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుందని రాహుల్ గాంధీ వెల్లడించారు. అందుకనే త్వరగా వాక్సీన్ కనిపెట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా వైరస్ కదలికలను గుర్తించే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని వెల్లడించారు. అలాగే… రాబోయే ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుతూ.. ఆహార సరఫరా.. నిరుద్యోగం వంటివి సవాల్ గా మారనున్నాయని అన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రాలకు అధిక వనరులు ఇవ్వడమే కాకుండా అధికారం కూడా ఇవ్వాలని రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.

కాగా కరోనావైరస్ కేసులు కనిపించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం కేరళ.. కరోనాను చాలా వేగంగా అరికట్టగలిగిందని తెలిపారు. వలస కార్మికుల సంక్షోభాన్ని నిర్వహించడంలో ప్రభుత్వం కొన్ని తప్పులు చేసిందని.. ఇది మరింత సూక్ష్మంగా.. మానవత్వంతో నిర్వహించాల్సి ఉందని రాహుల్ గాంధీ వివరించారు. అయితే ప్రణాళిక లేకపోవడం వల్ల సంక్షోభాన్ని మరింత దిగజార్చడంలో ప్రభుత్వం కొన్ని తప్పులు చేసిందని తెలిపారు. ఇప్పుడు దేశంలో పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని… రాండమ్ పరీక్షలు మాత్రమే కరోనాను మరింతగా కట్టడి చేయగలదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.