తమిళనాడులోని తూత్తుకుడి (టుటికోరిన్) ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన తండ్రీ కొడుకుల లాకప్ డెత్ కేసులో నలుగురు పోలీసులను సీబీ-సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ లను పోలీసులు చిత్రహింసలు పెట్టి మరీ వారి మృతికి కారణమైనారని ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా లాక్ డౌన్ కారణంగా రాత్రి 9 గంటలకు మూసి వేయాల్సిన తమ సెల్ ఫోన్ షాపును వీరు మరో పావుగంట పాటు తెరచి ఉంచడంతో తండ్రీ కొడుకులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ షాపు తెరచి ఉండటాన్ని చూసిన పోలీసులు.. మొదట తండ్రిని ఆ తర్వాత కుమారుడిని అరెస్ట్ చేశారు. ఇద్దరినీ రాత్రంతా పోలీసులు హింసించారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరోజు తేడాలో చనిపోయారు కూడా.