బ్రేకింగ్ : లోక్ సభ మాజీ స్పీకర్ మృతి !

lok sabha former speaker somnath chatterjee passes away
లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఛటర్జీ ఈ నెల 7వ తేదీన కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కిడ్నీ సమస్యలకి తోడు నిన్న  గుండెపోటు కూడా రావడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. అప్పటి నుండి డాక్టార్లు ఆయనకి ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స అందిస్తున్నారు, అయితే చికిత్స పొందుతూ ఆయన  ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కాగా సోమ్‌నాథ్ ఛటర్జీ మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.
lok sabha former speaker somnath chatterjee passes away