నిమ్మల రామానాయుడు అనారోగ్యం తో బాధపడుతూ సభ కు రావడంతో లోకేష్ నిమ్మలతో మాట్లాడారు. విశ్రాంతి తీసుకుంటారా.. లేక సభ నుంచి సస్పెండ్ చేయించమంటారా… ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి పనిచేస్తానంటే ఇక మిమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేయించాల్సిందే అన్నారు. లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల.. నిన్నటి మీద ఆరోగ్యం కొంచెం బాగానే ఉందని అన్నారు.. మాట వినకుంటే తన యాపిల్ వాచ్‌ని ఇక రామానాయుడు చేతికి పెట్టి నిద్రను తాను మానిటర్ చేస్తానని లోకేష్ అన్నారు. రామానాయుడు విశ్రాంతి తీసుకోవడానికి రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును లోకేష్ కోరారు.





