లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు…ఓటమికి నాయకులే కారణమట ?

lokesh controversial comments

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ ఘోర ప‌రాజ‌యానికి  అస‌లు కార‌ణం తమ పార్టీ నేతలే అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ మంత్రి లోకేష్. ఇవాళ ఎన్‌టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నారా లోకేష్ టీడీపీ ఎందుకు ఓడిందో అన్న కారణాన్ని వెల్ల‌డించారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీ దారుణ ఓట‌మికి 10 శాతం ఈవీఎంలు కార‌ణ‌మ‌ని, మిగిలిన 90 శాతం నాయ‌కులు కార‌ణ‌మ‌ని, వారే మోసం చేశార‌ని, అందుక‌నే ఎన్నిక‌ల్లో ఓడామని లోకేష్ అన్నారు. గల్లా జయదేవ్ వంటి నేతలు గెలవగా లేనిది మిగతా వాళ్లు ఎందుకు ఓడిపోయారో ఆలోచించుకోవాలని అన్నారు. , పార్టీ ఓటమికి నేతలు, కార్యకర్తలే బాధ్యలని అన్నారు. ఇంత ఘోరంగా ఓడిపోతామని ఎన్నడూ అనుకోలేదని, గెలుపు కచ్ఛితంగా మనదేనని చెబుతూ వచ్చిన నేతలు, అబద్ధాలు చెప్పినట్టు అర్థమవుతోందని పోలింగ్ రోజు నుంచి కౌంటింగ్ వరకూ అనుక్షణం ఏజంట్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పినా అశ్రద్ధ వహించారని అన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందని ఒక్కరు కూడా గుర్తించలేదని, నిత్యమూ ప్రజల్లో ఉండే కార్యకర్తలకు, ఓటర్ల మనసులోని మాట తెలిసినా, దాన్ని తమ వద్దకు తీసుకురాలేక పోయారని లోకేశ్ అభిప్రాయపడ్డారు. అంతేకాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అధికార పార్టీని ఆయన హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు టీడీపీ దక్కించుకునేలా ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.