అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్‌ అరెస్ట్‌ తప్పదా ?

Nara Lokesh shed tears over Chandrababu's arrest
Nara Lokesh shed tears over Chandrababu's arrest

అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు 97KM మేర వేయాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్లాన్ చేసింది.అయితే మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్,హెరిటేజ్ కు చెందిన భూములకు ఆనుకొని రింగ్ రోడ్డు వెళ్లేలా అలైన్మెంట్ లో మార్పులు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో వాళ్ళ భూముల ధరలు భారీగా పెరిగాయి అంటోంది. అసలు రింగురోడ్డే వేయలేదని, ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని టిడిపి ప్రశ్నించింది.

కాగా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు ఊహించని షాక్‌ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు ఢిల్లీ బయలుదేరారు. విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వనున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఉన్న విషయం తెలిసిందే. నారా లోకేష్‌కు 41A నోటీస్ ఇవ్వండని ఇప్పటికే హై కోర్టు చెప్పింది . అలాగే, విచారణకు సహకరించాలని నారా లోకేష్‌ను కోర్టు ఆదేశించింది .