నగరంలో ఆదివారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ రద్దీ సమయంలో లారీ అదుపు తప్పి వరుసగా ఆగి ఉన్న వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలవ్వగా, పలువురు గాయపడ్డారు. హనుమంతవాక జంక్షన్‌లో మధురవాడ వైపు వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను ఢీ కొట్టింది.
దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సాధారణంగా రద్దీగా ఉండే ఈ జంక్షన్ లో ఆదివారం కావడంతో కొంత ట్రాఫిక్ తక్కువగా ఉంది. లేనట్లయితే నష్టం తీవ్రత ఎక్కువగా ఉండేది.