నిజాం కుటుబంలో విషాదం నెలకొంది. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చిన్న కుమార్తె బషీరున్నిసా బేగం(93) మంగళవారం కన్నుమూశారు. వయసు సైబడిన కారణంగా గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ సంతానంలో ఈమె చివరిది. అంతేకాకుండా నిజాం నవాబు సంతానంలో ఇప్పటివరకు బతికి ఉన్నది కూడా ఆమె ఒక్కరే. నవాబ్ కాజీమ్ యార్ జంగ్ను వివాహం చేసుకోగా ఆయన 1998లో కన్నుమూశారు.
ప్రస్తుతం బషీరున్నిసా బేగం పురాణీ హవేలీలో నివసముంటున్నారు. బషీరున్నిసా బేగం మరణం పట్ల నిజం కుటుంబానికి చెందిన పలువురు కుటుంబసభ్యులు సంతాపం తెలియజేయడానికి ఆమె నివాసాన్ని సందర్శిస్తున్నారు. పలువురు ప్రముఖులు సైతం సంతాపం తెలిపారు. కాగా ఆమె అంత్యక్రియలు ‘జోహార్’ ప్రార్థనల అనంతరం పాతబస్తీలోని దర్గా యాహియా పాషా స్మశాన వాటికలో జరుగుతాయని బంధువులు తెలిపారు.