తెలంగాణలో మరో ఘటన గుండెలను పిండీస్తుంది. మహబూబ్ నగర్ లో జరిగిన ఈ ఘటన కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రేమ వ్యవహారంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని అమ్రాబాద్ మండలం ప్రశాంత్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రశాంత్‌నగర్ గ్రామానికి చెందిన కళమ్మ అనే మహిళ భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది. దీంతో ముగ్గురు కూతుళ్లను తల్లే పెంచి పెద్ద చేసింది. పెద్ద కుమార్తెకు పెళ్లైపోయింది. ఇక ఇద్దరు కూతుళ్లతో కళమ్మ కలిసి బ్రతుకు ఈడుస్తోంది. దీంతో తాజాగా ఇంటి నుంచి బయటికి వెళ్లిన రెండో కుమార్తె సుమలత చాలా సమయం అవుతున్నా ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కోసం తల్లి, చెల్లి గాలించగా పాత ఇంట్లోని దూలానికి ఉరేసుకొని విగతజీవిలా పడి ఉంది.