కాలేజీ రోజుల్లో ప్రేమ లేఖలు

కాలేజీ రోజుల్లో ప్రేమ లేఖలు

మహానటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. అంతే కాకుండా ఇప్పుడు చాలా మంది ఫేవరేట్‌ హీరోయిన్‌గా కీర్తి మారిపోయింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీర్తి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మహానటి తన మొదటి చివరి బయోపిక్‌ అని, ఇతర బయోపిక్‌లలో నటించాలని అనుకోవడంలేదని తెలిపారు. తనకు హాలివుడ్‌లో టామ్‌ క్రూజ్‌ అంటే ఇష్టమని, బాలీవుడ్‌లో షారుక్‌ఖాన్‌, దీపికా పదుకునే, అలియాభట్‌ అంటే ఇష్టమని చెప్పారు. ఇక కోలివుడ్‌కు వస్తే నయనతార డ్రస్సింగ్‌, సిమ్రాన్‌ డాన్స్‌ నచ్చుతాయని కీర్తి తెలిపారు.

ఇక ఈ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్నికీర్తి బయట పెట్టారు. కాలేజీ రోజుల్లో ఎన్ని లవ్‌ లెటర్స్   వచ్చాయి అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు కాలేజీ రోజుల్లో ఎవరు ప్రేమ లేఖలు రాయలేదని చెప్పింది. అయితే తాను ఒకసారి జ్యూవెలరీ షాపు ఓపెనింగ్ కు వెళ్లినప్పుడు అక్కడకు వచ్చిన ఒక అభిమాని, ఓ బహుమతిని ఇచ్చి వెళ్లినట్లు చెప్పింది. అందులో తన ఫోటోలను అల్బమ్ గా ఎంతో చక్కగా అమర్చాడని, వాటితో పాటే ఓ ఉత్తరాన్ని కూడా అతను దాంట్లో ఉంచాడని కీర్తి చెప్పారు. అందులో ఏముందని చూస్తే, తనకు ప్రపోజ్ చేస్తూ లవ్ లెటర్ రాశాడని, దాన్ని తాను చాలా భద్రంగా దాచుకున్నాను అని కీర్తి తన లవ్‌ లెటర్‌ సీక్రెట్‌ను బయట పెట్టింది. ఇక సినిమాల విషయానికి వస్తే తాజాగా కీర్తి నటించిన ‘గుడ్ లక్ సఖి’, ‘రంగ్ దే’ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి