లవ్ మ్యారేజ్… ఆపై వేధింపులతో గర్భవతి.. సూసైడ్..

తన ప్రేమని నిరాకరించిందని కక్ష పెంచుకున్న యువకుడు

తెలంగాణలో ఘోరం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.. డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఆ ఇల్లాలు ఏకంగా ఆత్మహత్యకు పాల్పడింది. అసలు విషయంలోకి వెళ్తే.. వినాయకనగర్‌కు చెందిన సమీనాభాను, నేరేడ్‌మెట్‌కు చెందిన సాయిచరణ్‌ ప్రేమించుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. అయితే మూడు నెలలుగా ఈ జంట వసంతపురి కాలనీలో నివాసముంటున్నారు. సమీనాభాను మూడు నెలల గర్భిణి కూడా. అయితే ఉద్యోగం లేకుండా ఇంటి పట్టునే ఉంటున్న సాయిచరణ్‌ కొన్ని రోజులుగా డబ్బుల కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. దీంతో మానసికంగా కృంగిపోయిన ఆ యువతి తాజాగా ఫ్యాన్ కు ఉరేసుకుంది. దీంతో ఇంటి పక్కన ఉండే వారు సమీనాభాను సోదరి మెహ్రాభానుకు ఫోన్‌ చేసి ఆమె సూసైడ్‌ చేసుకున్నట్లు సమాచారం అందించారు. ఇక వెంటనే అక్కడికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకున్న సమీనాభానును కిందికి దించి సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యుడిని పిలిపించారు.

అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యుడు చెప్పడంతో తీవ్ర కలకలం రేగింది. దీంతా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా సాయిచరణ్‌ వేధింపుల కారణంగా సమీనాభాను మృతికి కారణమని ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ హరీష్‌ తెలపారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరీష్‌ వివరించారు.