ఉత్తరప్రదేశ్ లో షాక్:ఏసీ పైపులో ఏకంగా 40 పాము పిల్లలు……

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. లక్నో సమీపంలోని మీరట్‌లో ఓ ఇంటి ఏసీ పైపులో ఏకంగా 40 పాము పిల్లలు బయటపడ్డాయి. దీంతో ఆ ఇంట్లో వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.  చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున జనం ఆ ఇంటిలో పోగయ్యారు. పాము పిల్లలను చూసేందుకు వారంతా ఎగబడ్డారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకరం రేపుతోంది.

అయితే అక్కడ కుటుంబ సభ్యులను పిలిచి.. ఆ ఏసీని ఓపెన్ చేసి చూడగా.. అందులోని పైపులో దాదాపు 40 పాము పిల్లలు కనిపించాయి. దీంతో శర్దానంద్ అనే కుటుంబానికి చెందిన వారంతా షాక్ కి గురయ్యారు. విషయం తెలుసుకొని ఆ ఊరంతా అక్కడికి చేరుకుంది. గ్రామస్తులంతా ఆ పాము పిల్లలను చూసేందుకు ఎగబడ్డారు. శర్దానంద్ కుటుంబం వాటన్నింటిని ఓ సంచిలో వేసి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై స్థానిక వెటర్నరీ డాక్టర్ డా.ఆర్కే వత్సల్ స్పందిస్తూ… గత కొన్ని నెలలుగా ఆ ఎయిర్ కండిషనర్ ఉపయోగంలో ఉండి ఉండకపోవచ్చునని.. అందుకే పాము అందులోకి చొరబడి గుడ్లు పెట్టినట్లు తెలిపారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో పాముల సంచారం సహజంగానే ఉంటుందని.. దాంతో ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.