పాక్ ఉగ్రవాదుల దుశ్చర్య… పీవోకేలో పురాతన బౌద్ధక్షేత్రం ధ్వంసం…

పాకిస్థాన్ ఉగ్రవాదులు మరోసారి భారతీయ సంస్కృతిని చాటే.. చారిత్రాక సాంస్కృతిక నిలయాలపై తమ ప్రతాపాన్ని చూపారు. తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాదాపుగా 800 ఏళ్లనాటి బౌద్ధ కట్టడాలను, క్షేత్రాలును ధ్వంసం చేశారు. ఈ భౌద్ధ క్షేత్రాలను పాక్ నిర్లక్ష్యం చేసింది. కొంతమంది పాక్ ఉగ్రవాదులు ఈ క్షేత్రాలను ధ్వంసం చేశారు.

తాజాగా అక్కడ భారతీయ సాంస్కృతిక చిహ్నాలైన చారిత్రక కట్టడాలు, భౌద్దారామాలను ధ్వంసం చేయడంపై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పీవోకేలో ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతుంటే పాక్ చూస్తూ కూర్చోవడంపై ఇండియా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాచీన, పురాతనమైన చిహ్నాలను ధ్వంసం చేయడం అనాగరికమైన చర్యగా భారత విదేశాంగ శాఖ ఇప్పటికే పలుమార్లు ఆరోపనాస్త్రాలు సంధించింది. వెంటనే అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేసింది. తమ దేశానికి చెందిన పురావస్తు శాఖాధికారులను అనుమతించాలని.. వారిని పునరుద్దరించేలా చూడాలని పాకిస్తాన్ కు ఇండియా విజ్ఞప్తి చేసింది. కానీ.. పాక్ ఆర్మీ అధికారుల అండదండలతోనే ఉగ్రవాదులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు భారత్ తీవ్రమైన ఆరోపనలు గుప్పిస్తోంది.