ఓటిటి పార్ట్న‌ర్ ని ఫిక్స్ చేసుకున్న ‘ల‌వ్ మౌళి’..!

'Love Mouli' fixed OTT partner..!
'Love Mouli' fixed OTT partner..!

హీరో న‌వ‌దీప్ న‌టించిన రీసెంట్ సినిమా ‘ల‌వ్ మౌళి’ రిలీజ్ కి ముందు ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాల‌ని క్రియేట్ చేసింది. ఈ మూవీ పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్లు మంచి బ‌జ్ ని క్రియేట్ చేశాయి. ఈ మూవీ ఎలాంటి కంటెంట్ తో వ‌స్తుందా అని అంద‌రూ ఆస‌క్తిగా చూశారు.

ఇక‌ ఈ మూవీ రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వ‌ద్ద మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకుంది. న‌వ‌దీప్ న‌ట‌న‌కి మంచి మ‌ర్కులే ప‌డ్డాయి. కానీ, అనుకున్న‌స్థాయిలో ఈ సినిమా విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. అయితే, ఇప్పుడు ఈ మూవీ ఓటిటి పార్ట్న‌ర్ ని లాక్ చేసుకుంది.

'Love Mouli' fixed OTT partner..!
‘Love Mouli’ fixed OTT partner..!

ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో ‘ల‌వ్ మౌళి’ స్ట్రీమింగ్ కానున్నదని మేక‌ర్స్ ప్రక‌టించారు. ఇక త్వ‌ర‌లోనే ఈ మూవీ ని స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు ఆహా వెల్ల‌డించింది. పంకూరి గిద్వాని హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ ను అవ‌నీంద్ర డైరెక్ట్ చేశారు. గోవింద్ వ‌సంత ఈ మూవీ కి సంగీతాన్ని అందించారు.