టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘లవ్‌స్టోరీ’ ఒకటి. ఫిదా తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.ఇటీవల విడుదలైన పాటలు, ప్రోమోలు సినిమాపై ఆ అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడం .. చిన్న సినిమాలు ధైర్యంగా ముందుకు వస్తుండటం మొదలైపోయింది. దాంతో ‘లవ్ స్టోరీ’ ఎప్పుడు విడుదల కానుందనే ఆసక్తి అందరిలో పెరుగుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా మేకర్స్ ‘వినాయకచవితి’ పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.