లవర్ మూవీ రివ్యూ…తెలుగు బుల్లెట్

Lover Movie Review

నటీనటులు : రాజ్ తరుణ్, రిద్ది, సత్యం రాజేష్, రాజీవ్ కనకాల, సుబ్బరాజు, అజయ్
దర్శకత్వం : అనీష్ కృష్ణ
ప్రొడ్యుసర్ : హర్షిత్ రెడ్డి
సమర్పణ : దిల్ రాజు

ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన రాజ్ తరుణ్ చేసింది కొన్ని సినిమాలయినా నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగా మారాడు. అయితే తర్వాత తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ లోనే వసృస చిత్రాలు తీస్తూ వచ్చినా గత కొంత కాలంగా వరుసగా డిజాస్టర్స్ చవిచూడాల్సి వచ్చింది. అయితే మొదటి సారి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో నటించాడు. అయితే 2014లో అలా ఎలా చిత్రంతో అలరించిన అనీష్ కృష్ణ దర్సకత్వంలో లవర్ అనే ఈ సినిమా ఈ రోజు విడుదలైంది.దిల్ రాజు బ్యానర్ అయినా పెద్దగా ప్రమోషన్స్ లేకుండా, పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ :

రాజ్ (రాజ్ తరుణ్) అనాధ, బైక్ మెకానిక్ గా పనిచేస్తూ బైక్ లు మాడిఫై చేసి అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. రాజీవ్ కనకాల- భార్గవి దంపతులే తనకు అన్నా, వదినలుగా భావించి వారింటిలోనే జీవనం సాగిస్తుంటాడు. అంతా సాఫీగా గడిచిపోతున్న సమయంలో ఒక యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్ లోజాయిన్ అయి అక్కడి నర్స్ గా పనిచేస్తున్న చరిత(రిద్ద్ది) అనే అమ్మాయిని చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు. కొన్ని రోజులు వెంటపడితే వద్దని వారించిన చరిత ఓక సంఘటన వల్ల ప్రేమలో పడుతుంది. ఆ తరువాత ఊహించని విధంగా వారి ప్రేమకు అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ సమస్యను ఆ యువ జంట ఎలా సాల్వ్ చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవల్సిందే.

లవర్ ఎంత మాయ చేశాడు :

అలా ఎలా తో దర్శకుడుగా మారిన అనీష్ కృష్ణ ఇప్పుడు మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మామూలు రొటీన్ లైన్ అయినా లవర్ సినిమా కథను మలిచిన విధానం చాలా బావుంది. ఇక హీరో హీరోయిన్ విషయానికి వస్తే రాజ్ తరుణ్ తనకు అలవాటయిన లవర్ బాయ్ పాత్రలో మెప్పించాడు. రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్, నటన బాగున్నాయి,గతంతో పోలిస్తే చాలా మెరుగయ్యాడు. కొత్త అమ్మాయి రిద్ధి చాలా అందంగా కనిపించింది. నర్స్ పాత్రలో ఆమె నటించిన విధానం నచ్చుతుంది. ఇక చాన్నాళ్ళ తర్వాత తెర మీద కనిపించిన రాజీవ్ కనకాల అదరగొట్టాడు.

ఇక కామెడీ కోసం చాలా మంది కమెడియన్లను వాడుకుందాం అనుకున్నా అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కొన్ని చోట్ల కావాలని ఇరికించిన కామెడీ ఇబ్బంది పెట్టింది. అయితే రాజ్ తరుణ్ గత చిత్రాలతో పోలిస్తే మాత్రం బాగానే ఉంది. దిల్ రాజు నిర్మాణ విలువలు మాత్రం సూపర్‌గా ఉన్నాయి. అలాగే అంకిత్ తివారి, రిషి రిచ్‌, అర్కో, త‌నీశ్ బాగ్చి, సాయికార్తీక్‌ ఇలా ఒక్కో పాటకు ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించిన పాటలు బాగున్నాయి. అలాగే జేబీ నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

తెలుగు బులెట్ పంచ్ లైన్ : లవర్ బాగానే ట్రై చేశాడు కానీ….
తెలుగు బులెట్ రేటింగ్ : 2.5 / 5