జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గూడూరు రెండో పట్టణంలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తేజస్విని, వెంకటేష్ అనే యువతీ, యువకులు గూడురు రెండో పట్టణంలోని ఓ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు.
ఆపస్మారక స్థితిలో ఉన్న వీరిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో తేజస్విని మరణించగా.. వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ జంట ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించింది అన్న వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.