మూతి ముద్దుల ప్రియా…లవర్స్ డే టీజర్ !

Lovers Day Romantic Teaser

ప్రేమికుల రోజున ప్రేక్షకులకు, అందునా ప్రేమికులకి ఫుల్ మిల్స్ గ్యారెంటీలా ఉంది లవర్స్ డే టీజర్ చూస్తుంటే. సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మలయాళ సినిమా ‘ఒరు ఆడార్ లవ్’ చిత్రానికి తెలుగు అనువాదం లవర్స్ డే గా విడుదల అవుతోంది. ఈ రోజుల్లో యువత ఎలా ఉంటున్నారనే కథాంశంతో చిత్రం తెరకెక్కింది. నిన్న సాయంత్రం సినిమా టీజర్ విడుదల చేశారు. ప్రియ ప్రకాష్ వారియర్ సినిమా టీజర్ కావడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. అయితే. అందులో మూతి ముద్దు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. ఈ కిస్ లవర్స్ డే టీజర్ కి హైలైట్ గా నిలిచింది. అసలే ప్రియ ప్రకాష్ పైగా మూతి ముద్దు తోడయింది. ఈ కారణాల చేత సినిమా చూడాలనుకునే యువతరం సంఖ్య ఎక్కువ అవుతోంది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కావడమూ సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో గురురాజ్, వినోద్ రెడ్డి విడుదల చేస్తున్నారు.