జగిత్యాల జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. గొల్లపల్లి మండలం గోవిందుపల్లి లో ప్రియురాలు లింగంపల్లి మనీషా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా ప్రియుడు రాకేష్ దుబాయిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. లక్ష్మీపూర్‌కు చెందిన రాకేష్, గోవిందుపల్లికి చెందిన మనిషా ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం రాకేష్ దుబాయ్ వెళ్ళగా, మనీషా ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పకపోవడంతో మరో అబ్బాయితో పెళ్ళి సంబంధం చూశారు.
ప్రేమ గురించి పెద్దలకు చెప్పే ధైర్యం చేయలేక మనీషా రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడగా, విషయం తెలిసిన రాకేష్, సెల్ఫీ వీడియో ద్వారా తల్లికి తన బాధను చెపుతూ మనీషా నీవు లేకుండా తాను బతకలేను అంటూ నీ వద్దకే వస్తున్నానని రూములో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియుడు రాకేష్ సెల్ఫీ వీడియో స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. క్షణికావేశంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడడంతో రెండు గ్రామాల్లో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.