ఇబ్రహీంపట్నంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో గ్రామ శివారులో పురుగుల మందు తాగి అనంతరం చెట్టుకు ఉరేసుకున్నారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గుండేటి రమ్య (22), మండలోజి ప్రణీత్‌చారి(22) రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరు వేర్వేరు కులాలకు చెందినవారు. ఇటీవల రమ్యకు పెళ్లి నిశ్చయమైంది.
తమ ప్రేమ విఫలం కావడం, మరొకరితో పెళ్లి ఇష్టంలేక రమ్య, ప్రణీత్‌చారి మంగళవారం వేకువజామున ఇంటి నుంచి వెళ్లి గ్రామశివారులో పురుగుల మందు తాగి అనంతరం చెట్టుకు ఉరేసుకోగా రమ్య ఉరితాడు తప్పి కిందపడింది. తన తండ్రి లక్ష్మణ్‌కు ఫోన్ చేసి పురుగుల మందు తాగానని చెప్పింది. వెంటనే అతడు మెట్‌పల్లిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రణీత్‌చారి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మృతురాలి తండ్రి లక్ష్మణ్, మృతుడి తల్లి మండలోజు సరోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.