Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పటికే పెరిగి ఇబ్బంది పెడుతున్న పెట్రోలు, డీజిల్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి.. వంటగ్యాస్ ధర పెంపు రూపంలో మరో సామాన్యుడి నెత్తిన గుదిబండ అయ్యింది. ప్రజలందరికీ నిత్యావసరం అయిన వంట గ్యాస్ ధర మరోసారి పెరిగింది. వంటగ్యాస్ ధరలను పెంచుతూ ఆయిల్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సబ్సిడీ సిలిండర్ ధర రూ.2.34, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.48 పెంచేశాయి. తాజా పెరుగుదలతో న్యూఢిల్లీలో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 493.55, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.698.50కి చేరుకుంది.
కోల్‌కతాలో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.723.50, ముంబయిలో రూ.671.50, చెన్నైలో 712.50గా ఉంది. మిగతా నగరల్లో ఎప్పటినుంచి అమల్లోకి వచ్చేదీ త్వరలో తెలియజేస్తామని చమురు కంపెనీలు శుక్రవారం తెలియజేశాయి. వాస్తవానికి గురువారమే ఈ నిర్ణయం వెలువడినప్పటికీ అధికారికంగా ఆయిల్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. వంటగ్యాస్ ధరలు పెరగబోవని, రూ.100 వరకు తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం, సహజవనరుల మంత్రిత్వశాఖ పేర్కొన్న నెలరోజులకే చమురు సంస్థలు ఈ విధంగా ధరలు పెంచడం కొసమెరుపు. 16 రోజులుగా వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై ఇప్పటికే ప్రజలు బీజేపీ సర్కార్ మీద ఆగ్రహంతో ఉన్నారు. వాటి ధరలను నియంత్రించడానికి ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సిలిండర్ ధర కూడా పెంచడంతో మరింత భారం పడనుంది