కర్ణాటకలో నేలమంగళ దగ్గర హైవే మీద జరిగిన బైక్ యాక్సిండెంట్ చూస్తే ఒళ్ళు గగ్గుర్పోస్తోంది. అలాంటి ఆక్సిడెంట్ వలన సాధారణంగా అయితే ప్రాణ నష్టం తప్పక జరగాల్సింది. ఆ కుటుంబం అదృష్టమో ఏమో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తుమకూరు-బెంగళూరు హైవే మీద బైక్‌పై వెళ్తున్న దంపతులు నేలమంగళ సమీపంలోని అరషినకుంటే వద్ద ఓ స్కూటీని చోసుకోకుండా వెనుక నుండి బలంగా ఢీ కొట్టారు. వెనుక భాగం నుంచి వేగంగా వచ్చి ఢీకొనడంతో స్కూటీపై ఉన్న వ్యక్తితోపాటు బైక్ మీది నుంచి దంపతులిద్దరూ కింద పడిపోయారు.
కానీ ముందు భాగంలో హ్యాండిల్ పట్టుకొని కూర్చున్న పాప అమూల్య మాత్రం అలాగే బైక్‌తోపాటు వెళ్లిపోయింది. రోడ్డు ప్రమాదం తర్వాత అర కిలోమీటర్ దూరంలో కుడి వైపు డివైడర్ మీదున్న పచ్చిక మీద పాప పడిపోయింది. పాప డివైడర్ మీద పడిపోయిన విషయాన్ని గమనించిన తోటి వాహనదారులు రక్షించారు. పాపతోపాటు, ఆమె తల్లిదండ్రులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ వీడియో మొత్తం చుస్తే ఫ్యూజులు ఎగిరిపోవదం ఖాయం. ఈ ఘటనకు సంబందించిన వీడియో వెనుక వస్తున్న కార్ కెమెరాలో రికార్డ్ అయ్యింది.