జాబిల్లి పైకి లూనా_25.. మరి చంద్రయాన్_3 పరిస్థితి ఏంటి?

Luna_25 on Jabilli.. And what is the condition of Chandrayaan_3?
Luna_25 on Jabilli.. And what is the condition of Chandrayaan_3?

జాబిల్లి గుట్టుమట్లు తెలుసుకునేందుకు చంద్రయాన్_3 ప్రయోగం ద్వారా మార్గం సుగమం అవుతోందని ఇస్రో సంబరపడుతోంది. యావత్ జాతి మొత్తం చంద్రుడి కక్ష్యలో దిగిన చంద్రయాన్_3 అప్డేట్స్ ను తీసుకునేందుకు ఎప్పటికప్పుడు ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇన్నిఅందాల జాబిల్లి మీద మనకంటే ముందుగానే రష్యా సానుకూల అంశాల మధ్య దిగింది. 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన “లూనా_25” ను విజయవంతంగా చంద్రుడి మీదికి పంపింది. రష్యా కూడా చంద్రుడి దక్షిణ ధ్రువాన్నే లక్ష్యంగా చేసుకుని పంపింది ,ముందుగా భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువమే లక్ష్యంగా చంద్రయాన్_3 ని పంపగా .. . దీనికోసం “లూనా_25” అనే స్పేస్ క్రాఫ్ట్ ను రష్యా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు “వాస్టోకీ కాస్మో డ్రామ్” అనే అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిపింది.

“వాస్టోకీ కాస్మో డ్రామ్” నుంచి నిప్పులు కక్కుతూ “లూనా_25” నింగిలోకి దూసుకెళ్లింది. ఇది కేవలం ఐదు రోజుల్లోనే చంద్రుడి కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం, చంద్రుడి దక్షిణ ధ్రువం పై దిగేందుకు అనువైన ప్రదేశం కోసం కొన్ని రోజులపాటు (3 లేదా7) అన్వేషించిన అనంతరం చంద్రుడి మీద దిగుతుంది. అక్కడ చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగిన అనంతరం ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు రష్యా అంతరిక్ష కేంద్రానికి చేరవేరుస్తుంది. చంద్రుడి మీద నీటి ఆనవాళ్లు ఉన్నాయని ఇస్రో గతంలో ప్రపంచానికి వెల్లడించిన నేపథ్యంలో.. వివిధ దేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు పలు రాకెట్లను చంద్రుడి మీదికి పంపించాయి.

అయితే ఆ ప్రయోగాల్లో ఆదేశాలు ఆశించినంత ప్రయోజనం కనిపించలేదు. ఇక చంద్రయాన్_3 ప్రయోగించిన ఇస్రో కూడా చంద్రుడి దక్షిణ ధ్రువం పైనే ప్రధానంగా దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులను, మానవ నివాసానికి యోగ్యంగా ఉంటాయా? అనే విషయాలను ప్రధానంగా చంద్రయాన్_3 అధ్యయనం చేస్తుంది. ఒకవేళ విలువైన లోహాలు గనక ఉండి ఉంటే అవి ఉపయోగపడతాయా? అనే కోణంలో కూడా అది పరిశీలనలు జరుపుతుంది.