ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మా ప్రెసిడెంట్ మంచు విష్ణుకలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌తో విష్ణు భేటీ అయ్యారు. అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడుతూ..’సీఎం జగన్‌తో సినిమా రంగం అంశాలపై మాట్లాడానని, ఏపీలో సినీ పరిశ్రమకు కృషి చేస్తానని పేర్కొన్నారు.వ్యక్తిగత అంశాల గురించి మాత్రమే సీఎం జగన్‌ను కలిశా.
సీఎంతో భేటీకి సీనియర్ నటుడు మోహన్‌బాబుకు ఆహ్వానం అందింది. కానీ కొందరు అందకుండా చేశారు. సినిమా టికెట్‌ల గురించి, ఇతర అంశాల గురించి ఫిల్మ్ ఛాంబర్‌లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. కొన్ని అంశాలపై విభేదాలు ఉన్నా సినిమా వాళ్లంతా ఒకే కుటుంబం. విభేదాలను అంతర్గతంగా పరిష్కరించుకుంటాం. సినిమా వాళ్లకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివి.అందరు తెలుగువాళ్లు మాకు కావాలి.
ఏపీలో సినిమా స్టూడియోలకు స్థలాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సంతోషకరం. కొంతమేర సినీ పరిశ్రమ తరలి వచ్చేందుకు విశాఖ అనువైన ప్రాంతమే. తిరుపతిలో సినిమా స్టూడియో నిర్మిస్తాం. ఏసియాలోనే బెస్ట్ పిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తా. ఇక రీసెంట్‌గా నేను చేసిన ట్వీట్‌పై కొందరు కావాలనే రాద్దాంతం చేశారు. దయచేసి దుష్ప్రచారం చేయొద్దు’ అని విష్ణు తెలిపారు.