శ్రీకాకుళంలో జిల్లాలో టీఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి…భలే స్కెచ్ వేశాడే !

madhavaram krishna rao

ఆయన ఒక తెరాస ఎమ్మెల్యే అభ్యర్ధి కానీ ఆయన శ్రీకాకుళం జిల్లాలో తేలాడు, ఇటీవల తుఫానుకు దెబ్బతిన్న ఆ జిల్లాలో కొన్ని ఏరియాల్లో పర్యటించి అక్కడ వెయ్యి ప్యాకెట్ల బియ్యం, బట్టలు, దుప్పట్లను ఆయన పంపిణీ చేశారు. వార్నీ బడవా ఇదేంది తెరాస ఏపీలో కూడా పాగా వెయ్యాలని చూస్తుందా అనుకుంటున్నారా ? అయితే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఈ మ్యాటర్ మొత్తం చదవండి. ఆ అభ్యర్ధి ఎవరో కాదు హైదరాబాద్ లోని కూకట్ పల్లి తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాధవరం కృష్ణరావు పర్యటించారు. తుఫాను బాధితులకు బియ్యం, బట్టలు, దుప్పట్లను పంపిణీ చేశారు.అంజనేయపురం, పాలెం గ్రామాల్లో కృష్ణారావు బాధితుల సమస్యలు ఆడిగితెలుసుకున్నారు. సిక్కోలు వాసులు కష్టజీవులని, అలాంటి ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు తనవంతు సహాయం చేయటానికి వచ్చానని చెప్పుకొస్తున్నారు. కృష్ణారావు తుపాను బాధితులకు కొంత సహాయ సామాగ్రి తీసుకుని ఉన్న పళంగా శ్రీకాకుళం రావడానికి కారణం ఏమిటో తెలుసా కూకట్ పల్లి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లే.

శ్రీకాకుళంలో జిల్లాలో టీఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి...భలే స్కెచ్ వేశాడే ! - Telugu Bullet

కూకట్ పల్లి నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు దాదాపుగా నలభై వేల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తూ ఉంటారు వారి కుటుంబీకులకు ఆకట్టుకునేందుకే కృష్ణారావు ప్రచారం కోసం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరేటప్పుడే కృష్ణారావు తన ప్రధాన డిమాండ్ ను ఉత్తరాంధ్ర ప్రజలకు చెందినదిగానే కేసీఆర్ కు చెప్పానని దాన్ని పరిష్కరిస్తానన్నారని చెప్పుకొచ్చారు. అదేమిటో తెలుసా…!

srikakulam mla

ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాలను బీసీ జాబితాలో చేర్చడం, అయితే మామూలుగా అయితే ఆ కులాలు అంతకు ముందు బీసీ జాబితాలోనే ఉండేవి కానీ కేసీఆర్ తెలంగాణ సీఎం అవగానే.. ఆ కులాలు తెలంగాణలో లేవని అవి ఉత్తరాంధ్ర కులాలని బీసీ జాబితా నుంచి తొలగించారు. దాంతో హైదరాబాద్ లో స్థిరపడిన ఉత్తరాంధ్ర వాసులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మళ్లీ ఆ కులాలను బీసీల్లో చేర్చుతారనే తాను టీఆర్ఎస్ లో చేరానని చెప్పుకున్న కృష్ణారావు… ఇంత వరకూ ఆ పని చేయించలేకపోయారు. మరి అలాంటి శ్రీకాకుళం జిల్లా తుపాను బాధితులకు పరామర్శకు వెళ్లారు. అసలే ఇప్పుడు తెరాసకు తెలంగాణాలో ప్రాణ సంకటంగా ఉంది. కొన్ని ప్రచార దృశ్యాలు చూస్తుంటే నవ్వు కూడా తెప్పిస్తున్నాయి, స్నానం చేయించడం, పిల్లలకి ఒళ్ళు రుద్డండం లాంటివి అన్న మాట. మరి కృష్ణారావు చేస్తున్న ఈ ప్రచారం ఏమి చేయనున్నదో మరి !

శ్రీకాకుళంలో జిల్లాలో టీఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి...భలే స్కెచ్ వేశాడే ! - Telugu Bullet