Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ భార్య ఇటీవల వార్తల్లోకి తెగ వస్తోంది. చాలా సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూనే ఉన్న మధుమిత ఇప్పుడు ఉన్నట్లుండి స్టార్ గుర్తింపు దక్కించుకుంది. శివబాలాజీ బిగ్‌బాస్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన మధుమిత ఆ తర్వాత కూడా మీడియాలో సందడి చేసింది. భర్త శివబాలాజీతో కలిసి ఇంటర్వ్యూలకు హాజరు కావడంతో పాటు, శివబాలాజీ కోసం ఓటు అపీల్ చేయడం ఇలా పలు రకాలుగా మధుమిత మీడియాలో సందడి చేస్తోంది.
బిగ్‌బాస్ ఇంట్లోకి మధుమిత ఒక ఎపిసోడ్‌లో కనిపించిన విషయం కూడా తెల్సిందే. మధుమితకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆమెను బిగ్‌బాస్ రెండవ సీజన్‌లో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. గత కొన్నాళ్లుగా ఈ విషయమై మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముద్దుగుమ్మ అనిపించుకున్న మధుమిత బిగ్‌బాస్‌లో కనిపిస్తే ఖచ్చితంగా బాగుంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కూడా ఉంది. కాని బిగ్‌బాస్ సీజన్ 2లో మధుమిత కనిపించడం అనేది కేవలం పుకారే అని తేలిపోయింది.
తాజాగా మధుమిత సన్నిహితులు ఈ విషయమై స్పందిస్తూ ఆమెకు చిన్న పిల్లలున్నారని, వారిని వదిలేసి అన్ని రోజులు ఆమె ఉండటం కష్టం అని, పిల్లలు కూడా ఉండలేరని, అసలు బిగ్‌బాస్ వారు ఆమెను సంప్రదించలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 2లో మధుమిత పార్టిసిపెంట్ అనే విషయంలో నిజం లేదని వారు క్లారిటీ ఇచ్చారు. శివబాలాజీ కూడా ఈ విషయంపై సన్నిహితులతో మాట్లాడుతూ అలాంటి ఆలోచన ఏమీ లేదని చెప్పుకొచ్చాడు.