బీజేపీకి షాకిచ్చిన బాలీవుడ్ హీరోయిన్…!

Madhuri Dixit Will Not Contest Next Lok Sabha Elections

బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పుణే లోక్‌సభ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా రంగంలోకిదించే విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీలోని విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం బీజేపీ చీఫ్ అమిత్‌షా సంపర్క్ ఫర్ సమర్ధన్( బీజేపీకి మద్దతు కోసం) కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ ఏడాది జూన్‌లో మాధురీ దీక్షిత్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేపట్టిన పథకాల గురించి ఆమెకు వివరించారు. అప్పట్నుంచీ ఆమె కమలదళంలో చేరనున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై మాధురి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పుణే నుంచి ఆమెను పోటీకి దించేందుకు దాదాపుగా నిర్ణయం జరిగిందని పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి.

Madhuri-Dixit

అయితే ఒక రకంగా దేశ వ్యాప్తంగా పార్టీ నుంచి వివిధ లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాను రూపొందించే పనిలో బీజేపీ అధిష్టానం ప్రస్తుతం తలమునకలై వుంది. ఈక్రమంలో 51 సంవత్సరాల మాధురీదీక్షిత్ పుణే లోక్‌సభ స్థానానికి సరైన అభ్యర్థిగా అధిష్టానం భావిస్తోందని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డారు. అయితే తన రాజకీయ అరంగ్రేటంపై మాధురీ దీక్షిత్ తాజాగా స్పందించింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తాను బీజేపీ టికెట్ పై పోటీ చేయబోవడం లేదని తేల్చిచెప్పింది. తన రాజకీయ ప్రవేశంపై మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. వాటిని అభిమానులు ఎవరూ నమ్మవద్దని తెలిపింది. దీంతో సినీ గ్లామర్ ను ఉపయోగించుకుని ఎలా అయినా గెలిచేద్దాం అనుకున్న బీజేపీకి పెద్ద షాకే తగిలిందనే చెప్పాలి.