తొలిరోజే మధ్య ప్రదేశ్ సీఎం సంచలన నిర్ణయం…ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్లపై ఆంక్షలు

Madhya Pradesh CM's sensational decision on the first day...restrictions on loudspeakers in prayer places
Madhya Pradesh CM's sensational decision on the first day...restrictions on loudspeakers in prayer places

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మోహన్ యాదవ్ తొలిరోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే కీలక ఫైళ్లపై సంతకం చేశారు. మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల నియంత్రణకు సంబంధించి ఆయన తొలి ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించిన పరిమితికి మించి లౌడ్ స్పీకర్లను వినియోగించడంపై నిషేధం విధిస్తూ ముఖ్యమంత్రి హోదాలో మోహన్ యాదవ్ తొలి ఉత్తర్వులపై సంతకం చేశారు.

ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోహన్ యాదవ్ కేబినెట్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా లౌడ్ స్పీకర్ల వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేసినట్లు అదనపు చీఫ్ సెక్రెటరీ (హోం) డాక్టర్ రాజేశ్ రాజోరా తెలిపారు. సీఎం జారీ చేసిన ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించారు. మరోవైపు లౌడ్ స్పీకర్లు, డీజే సిస్టమ్ల శబ్దాలను మానిటర్ చేయడానికి ప్రతి జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇంకోవైపు, సింగిల్ విండో విధానం ద్వారా ఆస్తి హక్కు బదిలీలు జరిగేలా మధ్యప్రదేశ్ కేబినెట్ సైబర్ తెహసీల్ స్కీమ్ను తీసుకొచ్చింది. ఈ విధానం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రంలోని 55 జిల్లాల్లో అమలులోకి రానున్నట్లు పేర్కొంది.