Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం అంటూ ఓ పోరాటం మొదలుపెట్టిన శ్రీ రెడ్డి తర్వాత ఎవరో చెప్పారని పవన్ మీద నోరు పారేసుకుని సంచలనం చేయగా తన తల్లిని తిడతారా ? అలా ఒక ఆడదాన్ని తిడితే మీడియా ఇలానా చేసేది అంటూ కొన్ని మీడియా చానెళ్ళ మీద ఫైట్ మొదలు పెట్టారు. కొన్ని మీడియా ఛానెల్స్ ను బ్యాన్ చేయాలని, ఆ కొన్ని చానెళ్ళ వెనుక తెలుగుదేశం ఉందని ఆరోపిస్తు వచ్చారు. అయితే పవన్ ఈ విషయం మీద బయటకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని భుజాన వేసుకున్న మెగాస్టార్, బాలకృష్ణ మినహా టాలీవుడ్ లోని మిగతా హీరోలందరితో ప్రత్యేక భేటీ అయ్యారు. ఇక ఈ ఛానెల్స్ కి సినిమా విజువల్స్, కాని ఇంటర్వ్యులు కాని, ఆడియో ఫంక్షన్ లు లైవ్ కాదు కదా కనీసం తర్వాత కూడా వాడుకోకుండా నిషేధం విధించాలని చిరంజీవి సదరు హీరోలని కోరగా కొందరు బాహాటంగానే కుదరదని చెప్పినా మరికొందరు సమయం కావాలని కోరారట.
అయితే ఈ భేటీలో కేవలం హీరోలే కాక కొంతమంటి నటులు, దర్శకులు, నిర్మాతలు కూడా హాజరయ్యారు. న్యూస్ ఛానెల్స్ తో కంపేర్ చేస్తే ఎంటెర్టైన్మెంట్ మీడియా ఛానెల్స్ కే ఎక్కువ రేటింగ్, ఎక్కువ కవరేజీ ఉంటుందని దీంతో ఆడియో ఫంక్షన్ లు సినిమా కవరేజ్ లు న్యూస్ ఛానెల్స్ కు ఇవ్వనంత మాత్రాన నష్టం ఏమి ఉండదని పలువురు అభిప్రాయ పడ్డారట. అయితే వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పట్టించుకోకుండా తన సినిమా మహానటి కవరేజ్ టీవీ9, ఏబీఎన్, ఎన్టీవీ కి ఇచ్చి మెగాస్టార్ కి షాక్ ఇచ్చాడు మెగా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్. చాలా కాలం గ్యాప్ తర్వాత మరలా రీఎంట్రీ ఇచ్చిన ఆయన తన ఇద్దరి కూతుళ్ళతో కలిసి మాహానటి సావిత్రి జీవిత కదా ఆధారంగా మహానటి తెరకెక్కించాడు.
అయితే ఎప్పటి నుండో మెగా కాంపౌండ్ ప్రొడ్యూసర్ గా పేరొందిన ఆయన ఇప్పుడు మెగాస్టార్ నిర్ణయాన్ని కాదని తన సినిమా ఆడియో ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకి దారి తీసింది. నిజానికి ఇండస్ట్రీలోని చాలామందికి ఈ చానెల్స్ విషయంలో బ్యాన్ విధించడం ఇష్టం లేదు. నిజానికి మీడియాని నిషేధిస్తే అది ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకే నష్టం కలిగిస్తుందని పలువురు మేధావులు చెబుతున్నారు. మీడియాకి సినిమా ఒక్కటే వార్తాంశం కాదు కదా ఈ విషయం చిన్న పిల్లాడ్ని అడిగినా చెబుతాడు కానీ సినీ పెద్దలు ఈ లాజిక్ ఎందుకు తెలుసుకోలేక పోతున్నారో తెలియట్లేదు. భారీ ఖర్చుతో ఏర్పాటు చేసే ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకలను మీడియా కాకుండా ఎవరు కవర్ చేస్తారో సదరు ఇండస్ట్రీ పెద్దలకే తెలియాలి. బహుశా ఇవన్నీ ఆలోచించుకునే అశ్విని దత్ మీడియా చానెళ్ళకే కవరేజ్ రైట్స్ ఇచ్చేసాడని ఫిలిం నగర్ టాక్. ఏది ఏమయినా తానూ నిర్ణయించినట్టుగానే జరుగుతుంది అని భావించిన మెగాస్టార్ కి ఇది కొంచెం షాకింగ్ విషయమే.