‘మహానటి’కి కూడా ఇచ్చిన సీఎం బాబు

mahanati team meets chandra babu naidu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సావిత్రి జీవిత చరిత్రం ‘మహానటి’కి వెండి తెరపై ప్రేక్షకులు నిరాజనాలు పడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం సావిత్రి గురించిన చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. సావిత్రి మరణంకు సంబంధించిన పలు విషయాలు గత కొంత కాలంగా ఎవరికి తెలియని రహస్యాలుగా ఉన్నాయి. అలాంటి విషయాలను మరియు ఆమెకు సంబంధించిన పలు విషయాలను వెండి తెరపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆవిష్కరించిన అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఈ చిత్రంపై సినీ ప్రముఖులతో పాటు అంతా కూడా అభినందను తెలియజేస్తున్నారు. తాజాగా ‘మహానటి’ చిత్ర యూనిట్‌ సభ్యులకు ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా సన్మానించారు. మహానటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దర్శకుడు అశ్వినీదత్‌, నిర్మాతలకు తన అభినందనలు అంటూ చంద్రబాబు ప్రశంసించారు.

ఈ సమయంలోనే ‘మహానటి’ చిత్రానికి ఏపీలో వినోదపు పన్ను రాయితీ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. గతంలో బాలకృష్ణ, క్రిష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంకు కూడా ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రానికి పన్నులో మినహాయింపు ఇస్తున్నట్లుగా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ రెండు చిత్రాలకు పన్ను మినహాయింపు ఇవ్వడం పట్ల ‘రుద్రమదేవి’ దర్శకుడు గుణశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ చిత్రానికి కూడా పన్ను మినహాయింపు ఇవ్వాల్సిందిగా సీఎం చంద్రబాబును పదే పదే కోరాను. కాని ఆయన తన విజ్ఞప్తిని కనీసం పరిశీలించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాని ఈ రెండు సినిమాలకు మాత్రం అడగకుండానే పన్ను రాయితీని ఇచ్చారు.