‘అతడు’లా అజ్ఞాతవాసి కూడా..!

Trivikram comments on Agnyaathavaasi movie disaster

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. అయితే ఆ ఫ్లాప్‌ను దర్శకుడు త్రివిక్రమ్‌ జీర్ణించుకోలేక పోతున్నాడు. తాను ఎంతో కష్టపడి ఆ చిత్రాన్ని చేశాను, తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుందని అనుకున్నాను. కాని ఆ చిత్రం కొంతమందికి మాత్రమే నచ్చింది. ఆ సినిమా భవిష్యత్తులో తీయాల్సి ఉందని, ఇప్పుడు కాకుండా మరో అయిదు సంవత్సరాల తర్వాత ఆ సినిమా తీసి ఉంటే తప్పకుండా మంచి ఫలితం వచ్చేది అంటూ త్రివిక్రమ్‌ చెప్పుకొచ్చాడు. ‘అతడు’ సినిమా కూడా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చి థియేటర్లలో సక్సెస్‌ కాలేదు. కాని ఆ తర్వాత బుల్లి తెరపై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు అజ్ఞాతవాసి కూడా అదే తరహా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో త్రివిక్రమ్‌ ఉన్నాడు.

అతడు సినిమాను అర్థం చేసుకునేందుకు ప్రేక్షకులకు కాస్త సమయం పట్టింది. ఆ చిత్రం ఇప్పుడు వస్తే సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుంది. కాని కాస్త ముందే రావడం వల్ల ఆకట్టుకోలేక పోయింది. టీవీలో వచ్చిన ప్రతి సారి కూడా సినిమా విజయాన్ని సాధిస్తూనే ఉంది. అలాగే అజ్ఞాతవాసి గురించి కూడా అలాంటి వార్తలే వింటామనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు. అజ్ఞాతవాసి సినిమా కోసం పవన్‌తో పాటు అంతా కూడా చాలా కష్టపడ్డాం. కాని ఫలితం దక్కక పోవడం నిరాశను కలిగించింది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్నాడు. ‘అరవింద సమేత’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.