“మహారాజ” మూవీ ఓటిటి డేట్ ఫిక్స్?

"Maharaja" Movie OTT Date Fix?

కోలీవుడ్ వెర్సటైల్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా యువ దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “మహారాజ”. మరి ఇంటెన్స్ ఎమోషన్స్ మరియు సాలిడ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయ్యింది.

తమిళ్ సహా తెలుగులో కూడా ఈ మూవీ మంచి వసూళ్లు అందుకొని లాభాలు అందించగా తాజాగా ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో కూడా చేరి విజయ్ సేతుపతి కెరీర్ లో బెంచ్ మార్క్ మూవీ 50వ గా వచ్చి ఒక గుర్తుండిపోయే హిట్ లా నిలిచింది. ఇక ఈ మూవీ ఓటిటి రిలీజ్ సంబంధించి లేటెస్ట్ బజ్ అయితే వినిపిస్తుంది.

"Maharaja" Movie OTT Date Fix?
“Maharaja” Movie OTT Date Fix?

కోలీవుడ్ వర్గాల ప్రకారం ఈ మూవీ అయితే ఈ జూలై 19 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మూవీ ఓటిటి హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి అందులో ఈ మూవీ జూలై 19 నుంచి రానున్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్నది .