శివసేనకు మహారాష్ట్ర సీఎం పీఠం

శివసేనకు మహారాష్ట్ర సీఎం పీఠం

అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పోటీ నుంచి తప్పుకోవడం వల్ల శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాగా మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు సమయం వచ్చింది. కనీస ఉమ్మడి ప్రణాళికను శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి కనీస ఉమ్మడి ప్రణాళికను ఏర్పాటు చేసి అంగీకారం తెలిపారు.

డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్‌, మంత్రి పదవులు చెరి సమానంగా ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు పంచుకుని ఐదేళ్ల​ పాటు సీఎం పీఠం శివసేనకు అప్పగించనున్నారు. గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో మూడు పార్టీల నేతలు సమావేశం అవనున్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రస్తుతం ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ని కోరనున్నారు. ఉద్దవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్యా ఠాక్రేనే సీఎం అని ప్రచారం జరిగాగా మరో వ్యక్తిని సీఎంగా నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతలు రాజకీయాలు కొత్త కావడం, కనీస అనుభవం లేకపోవడం వల్ల ఆదిత్యాను సీఎం అభ్యర్థిగా ఎన్నుకునేందుకు  ఒప్పుకోవడం లేదు. శివసేన సీనియర్‌ నేతలైన శుభాష్‌ దేశాయ్‌, ప్రస్తుత పార్టీ పక్షనేత ఏక్‌నాథ్‌ షిండే సీఎం పీఠానికి సరిపోరని అంచనాకి వచ్చాక ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా బలమైన నేతనే సీఎంగా  ఎన్నుకోవాలని మూడు పార్టీల నేతలు చర్చించారు.

శివసేనలో ఒక్క ఉద్ధవ్‌ ఠాక్రే తప్ప మరెవ్వరూ లేరని సేన నిర్ణయించుకుని ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం అభ్యర్థి అయితేనే తాము మద్దతు తెలుపుతామని ఎన్సీపీ, కాంగ్రెస్‌ షరతు విధించారు. ఆదిత్యాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. పూర్తి వివరాలను గవర్నర్‌తో భేటీ తరువాత ఉమ్మడిగా కీలక ‍ ప్రకటన తెలియచేస్తారని తెలుస్తోంది.