నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. బాలకృష్ణ టైటిల్ రోల్లో నటించబోతున్న ఈ చిత్రంకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ఏయన్నార్ పాత్రను యువ హీరో అక్కినేని నాగచైతన్య చేయబోతున్నట్లుగా ఇప్పటికే ఖరారు అయ్యింది. ఇక చంద్రబాబు నాయుడు పాత్రను రానాతో పోషింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆయన సినీ జీవితం పక్కన పెడితే రాజకీయ జీవితంలో చాలా క్రియాశీలక పాత్రను చంద్రబాబు నాయుడు పోషించినట్లుగా చెప్పుకోవచ్చు. అందుకే రానా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండబోతుంది.
ఇక ఎన్టీఆర్ పలు చిత్రాల్లో కృష్ణతో కలిసి నటించాడు. అందుకే ఎన్టీఆర్ చిత్రం అంటే ఖచ్చితంగా కృష్ణను చూపించాలని భావిస్తున్నారు. అందుకే కృష్ణ పాత్రకు ఆయన కొడుకు మహేష్‌బాబును చూపించాలని క్రిష్ భావిస్తున్నాడు. అందుకోసం ఇప్పటికే మహేష్‌బాబుతో క్రిష్ చర్చలు జరిపినట్లుగా సమాచారం అందుతుంది. క్రిష్‌కు మహేష్‌బాబుతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ సంబందం కారణంగా బాలకృష్ణ సినిమాలో నటించేందుకు మహేష్‌బాబు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడని, ఖచ్చితంగా మహేష్‌బాబు స్క్రీన్ అప్పియరెన్స్ ఎన్టీఆర్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మహేష్‌బాబు సినిమాలో ఉంటే చిన్న పాత్ర అయినా కూడా సినిమా స్థాయి అమాంతం పెరిగి పోవడం ఖాయం.