మహేష్‌, సందీప్‌లతో అల్లు అరవింద్‌

Mahesh Babu and Sandeep Vanga Movie Produced By allu arvind

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’లో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్‌బాబు చేయబోతున్న 26వ చిత్రంకు ఇప్పటికే దర్శకుడు మరియు నిర్మాత ఖరారు అయ్యారు. 26వ చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ మేకర్స్‌ వారి బ్యానర్‌లో నిర్మాణం జరుగబోతుంది. సుకుమార్‌ మూవీ ఇంకా ప్రారంభం కాకుండానే మహేష్‌ 27వ చిత్రంకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

sandeep-vanga

గత కొన్ని రోజులుగా అల్లు అరవింద్‌ నిర్మాణంలో మహేష్‌బాబు సినిమా ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. మహేష్‌బాబు 27వ చిత్రాన్ని ‘అర్జున్‌ రెడ్డి’ ఫేం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో నిర్మించేందుకు అల్లు అరవింద్‌ సిద్దం అవుతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అర్జున్‌ రెడ్డి తర్వాత మహేష్‌బాబుతో సినిమాను చేసేందుకు స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లుగా చెప్పిన సందీప్‌ రెడ్డి ప్రస్తుతం మహేష్‌బాబు డేట్ల కోసం ఎదురు చూస్తున్నాడు. వచ్చే ఏడాది చివర్లో అల్లు అరవింద్‌ నిర్మాణంలో సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో మహేష్‌బాబు మూవీ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తుంది.

mahesh-babu