ఇటీవల ‘మహర్షి’ సినిమాతో సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమాకి సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ‘ఎఫ్ 2’ చిత్రంతో సక్సెస్ అందుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి మహేష్ బాబు కాంబినేషన్ లోని సినిమా ఈరోజు లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. సినిమా టైటిల్ పోస్టర్ ని బట్టి ఇది మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన దర్శకుడు అనీల్ రావిపూడి సినిమా మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా కనిపించబోతున్నారని ప్రకటించారు. గతంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు పోషించగా ఆర్మీ ఆఫీసర్ గా కనిపించడం ఇదే తొలిసారి. దిల్ రాజు, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా యంగ్ సెన్సేషన్ రష్మిక మందన్న మహేష్ సరసన హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమాను 2020 సంక్రాంతి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి కూడా మహేష్ హాజరు కాలేదు. ఇక చాలా ఏళ్ల తరువాత నటి విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.