భరత్‌ కలెక్షన్స్‌పై విమర్శలు

Mahesh Babu Bharat ANe Nenu movie Collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భరత్‌ అనే నేను’ సూపర్‌ హిట్‌ టాక్‌ను దక్కించుకుంది. రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను ఈ చిత్రం వసూళ్లు చేసింది. ఈ చిత్రం మొదటి వారం రోజుల్లో ఏకంగా 161 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది అంటూ యూనిట్‌ సభ్యులు స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మహేష్‌బాబు సినిమాకు కలెక్షన్స్‌ విషయంలో ఎప్పటి మాదిరిగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 116 కోట్లను 161 కోట్లుగా చూపించే ప్రయత్నం జరుగుతుందని కొందరు ట్రోల్‌ చేస్తున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేసిన పోస్టర్‌లో మిస్టేక్‌ జరిగి ఉంటుంది లేదా చిత్ర యూనిట్‌ సభ్యులు కావాలని ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం ఓపెనింగ్స్‌ను భారీగానే రాబట్టింది. అయితే నాల్గవ రోజు నుండి కలెక్షన్స్‌ కాస్త తగ్గిన మాట వాస్తవమే, అందుకే చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నట్లుగా 161 కోట్లు వసూళ్లు అయ్యి ఉండవు అని ట్రేడ్‌ పండితులు కూడా చెబుతున్నారు. మొత్తానికి మహేష్‌బాబు సినిమా కలెక్షన్స్‌ విషయంలో విమర్శలు సోషల్‌ మీడియాను కుదిపేస్తున్నాయి. భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తూ టాలీవుడ్‌ టాప్‌ 3 స్థానంకు ఈ చిత్రం చేరిందని నిరూపించేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు బాగా తాపత్రయ పడుతున్నారని, ఫేక్‌ కలెక్షన్స్‌తో రికార్డులు సంపాదించడం మంచి పద్దతి కాదు అంటూ మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి రంగస్థలం చిత్రం నెం.3 ఉండగా, భరత్‌ అనే నేను చిత్రం త్వరలోనే నెం.3 స్థానంకు చేరుతుందనే అభిప్రాయంతో మహేష్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు.