వాట డిమాండ్‌ చేస్తున్న సమంత

No Remuneration for Samantha for U-Turn Movie Remake

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత తాజాగా ‘రంగస్థలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో పాటు, ఆ చిత్రంలో సమంత పాత్రకు మంచి పేరు వచ్చింది. దాంతో సమంత క్రేజ్‌ విపరీతంగా పెరిగింది. భారీ స్థాయిలో అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం తర్వాత ప్రస్తుతం సమంత ‘యూటర్న్‌’ అనే చిన్న చిత్రాన్ని చేస్తోంది. ఈ చిత్రాన్ని మొదట సమంత నిర్మించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మామ నాగార్జున మద్దతుతో సమంత నిర్మించడం ఖాయం అంటూ పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో సమంత ఆ వార్తలు కొట్టి పారేసింది. తాను ఆ చిత్రాన్ని నిర్మించడం లేదని తేల్చి పారేసింది.

‘యూటర్న్‌’ చిత్రంపై ఉన్న అభిమానంతో పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పారితోషికం స్థానంలో సినిమా లాభాల్లో వాటాను ఇవ్వాల్సిందిగా నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సమాచారం అందుతుంది. యూటర్న్‌ కన్నడంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు మరియు తమిళంలో ఈ చిత్రం తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈ చిత్రం మినిమం సక్సెస్‌ టాక్‌ను దక్కించుకుని ఒక మోస్తరు కలెక్షన్స్‌ను రాబడితే 2.5 కోట్ల వరకు సమంత వాటా దక్కే అవకాశం ఉంది. ఇక సూపర్‌ హిట్‌ అయ్యి, భారీ కలెక్షన్స్‌ వస్తే 3.5 నుండి 5 కోట్ల వరకు కూడా సమంతకు దక్కే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న యూటర్న్‌ రీమేక్‌ ఇదే సంవత్సరంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.