క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే…అదరకొట్టిన నా పేరు సూర్య ట్రైలర్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రైట‌ర్ నుండి డైరెక్ట‌ర్ అయిన వ‌క్కంతం వంశీ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం నా పేరు సూర్య . మే 4న విడుద‌ల కానున్న ఈ సినిమా ఆర్మీ నేపథ్యంలో రూపొందింది. తాడేపల్లిగూడెం సమీపంలోని మిలటరీ మాధవరం లో ఆడియో వేడుక జ‌రుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న గచ్చిబౌలిలో ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌పుకోనుంది. ఈ కార్య‌క్రమానికి రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిధిగా హాజ‌రుకానున్నాడు. అయితే చిత్ర రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మూవీపై ఆస‌క్తి క‌లిగిస్తున్నారు మేక‌ర్స్ .

కొద్ది సేప‌టి క్రితం చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో బ‌న్నీ చెప్పే డైలాగ్స్‌తో పాటు ఆయ‌న ప‌ర్‌ఫార్మెన్స్ అభిమానుల‌లో మరింత అంచనాలు పెంచేస్తోంది. మిలిట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బ‌న్నీ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. నా పేరు సూర్య చిత్రం తెలుగులోనే కాక ప‌లు భాష‌ల‌లోను విడుద‌ల కానుంది. నాకు కోపం వచ్చినపుడు బూతులే వస్తాయి.. మంత్రాలు రావు.. క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే వంటి కొన్ని డైలాగ్స్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. అందరిని అలరిస్తోన్న ట్రైలర్ మీ కోసం