సమంత తన స్టార్‌డంను చూపించింది…!

Positive Talk U Turn Movie

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత తన సత్తా చాటింది. తెలుగు మరియు తమిళంలో ఈమె తాజాగా చేసిన చిత్రం ‘యూటర్న్‌’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు మొదట మిశ్రమ స్పందన వచ్చింది. పాజిటివ్‌ రివ్యూలు వచ్చినా కూడా కలెక్షన్స్‌ మాత్రం కాస్త నిరాశ పర్చాయి. అయితే శైలజా రెడ్డి అల్లుడు ఎప్పుడైతే డల్‌ అయాడో వెంటనే ‘యూటర్న్‌’ చిత్రంకు బారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కలెక్షన్స్‌ను చూస్తే ట్రేడ్‌ వర్గాల వారు కూడా నోరెళ్లబెడుతున్నారు. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉందని, మంచి వసూళ్లు వస్తున్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

samantha

తెలుగు మరియు తమిళంలో ప్రస్తుతం ఈ చిత్రం రాబడుతున్న కలెక్షన్స్‌ సినిమా నిర్మాతకు భారీ లాభాలను తెచ్చి పెడుతున్నాయి. లాభాల్లో వాటాను తీసుకుంటున్న సమంతకు ఇప్పటి వరకు 3.3 కోట్ల వరకు ముట్టినట్లుగా సమాచారం అందుతుంది. మరో వారం రోజులు ఇదే జోరు కొనసాగే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మొత్తానికి సమంత తన స్టార్‌డంతో సినిమాను నెట్టుకు వచ్చింది. సమంత నటించింది కనుక ఈ చిత్రంకు ఇంత భారీగా క్రేజ్‌ దక్కిందని, అంతే కాకుండా ఈ చిత్రంకు తమిళనాడులో కూడా భారీగా వసూళ్లు నమోదు అవ్వడంకు కారణం సమంత అంటూ టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి యూటర్న్‌ చిత్రం రెండు భాషల్లో మంచి వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో స్టార్‌ స్టేటస్‌ నిరూపితం అయ్యింది.

u-turn