సమంత ఆ రీమేక్‌కు డేట్లు ఇచ్చేసింది…!

Samantha Miss Granny Remake To Kick Start Soon

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని పెళ్లి తర్వాత సినిమాల సంఖ్య కాస్త తగ్గించిన విషయం తెల్సిందే. మంచి పాత్రలు, మంచి కథలు చూసి మరీ ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం భర్త చైతూతో కలిసి ‘మజిలి’ చిత్రాన్ని చేస్తున్న సమంత త్వరలోనే కొరియన్‌ మూవీ ‘మిస్‌ గ్రానీ’ రీమేక్‌ లో నటించబోతుంది. ఈ రీమేక్‌ గురించి చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన విషయమై క్లారిటీ వచ్చేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ రీమేక్‌ను సురేష్‌బాబు నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. త్వరలోనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. ఇదే సమయంలో ఈ చిత్రంకు సమంత డేట్లు కూడా కేటాయించిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Samantha

సమంత ఈమద్య హీరోయిన్‌ ప్రాముఖ్యత ఉన్న సినిమాలు చేయాలని కోరుకుంటుంది. అందుకోసం ఈమె ఇప్పటికే ‘యూటర్న్‌’ చిత్రాన్ని చేసిన వియం తెల్సిందే. ఆ సినిమా తెలుగులో ఒక మోస్తరుగా నిలిచింది. సమంత పాత్రకు మంచి పేరు వచ్చింది. అందుకే మరోసారి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాన్ని చేయాలని సమంత భావిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో మిస్‌ గ్రానీ రీమేక్‌పై సమంత చాలా ఆశలు పెట్టుకుంది. సమంత త్వరలోనే మజిలి చిత్రంను పూర్తి చేయబోతుంది. డిసెంబర్‌ లో మిస్‌ గ్రానీ రీమేక్‌ పూజా కార్యక్రమాలు జరిపి జనవరి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు. జనవరి రెండవ వారంకు ‘మజిలి’ చిత్రాన్ని పూర్తి చేసి ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మొత్తానికి సమంత చాలా బిజీగా వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే నంది రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. ఈమె చేసిన మొదటి సినిమా తప్ప తదుపరి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో మిస్‌ గ్రానీ రీమేక్‌ను ఏం చేస్తుందో నంటూ అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Miss-Granny-Remake