సైరా సీన్‌కు 45 కోట్లు.. నిజం ఎంత…!

Sye Raa Narasimha Reddy Movie Budget 200 Crores

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే జార్జియాలో భారీ యుద్ద సన్నివేశాలకు రంగం సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఆ యుద్ద సన్నివేశాల కోసం దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఏకంగా 45 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. రికార్డు స్థాయిలో ఖర్చు చేస్తున్న కారణంగా అందరు కూడా ఈ విషయమై చర్చించుకుంటున్నారు. అయితే సినీ వర్గాల్లో మాత్రం ఈ వార్త నిజం కాదేమో అంటున్నారు. ఎందుకంటే ఇంత బడ్జెట్‌తో యుద్ద సన్నివేశాలు అంటే మామూలు విషయం కాదు. 45 కోట్ల బడ్జెట్‌తో ఒక చిత్రంనే షూట్‌ చేయవచ్చు. కాని సైరా కోసం కేవలం పావు గంట యుద్ద సీన్స్‌ను చిత్రీకరించడం ఏంటీ అంటున్నారు.

syera-cheranjeevi

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సాహో’ చిత్రంలోని ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌ను ఏకంగా 90 కోట్లకు పైగా ఖర్చు చేసి తెరకెక్కించినట్లుగా చెబుతున్నారు. అందుకే సైరా చిత్రం కోసం కూడా భారీ యుద్ద సన్నివేశాలను చిత్రీకరించాలని రామ్‌ చరణ్‌ కూడా భావిస్తున్నాడట. దాదాపు రెండు వందల కోట్లకు పైగా ఈ చిత్రంకు రామ్‌ చరణ్‌ కేటాయించాడు. పారితోషికంగా చిరంజీవికి ఇవ్వాల్సింది ఏమీ లేదు. కనుక ఆ మొత్తంను కూడా నిర్మాణంకు ఖర్చు చేయాలని చరణ్‌ భావిస్తున్నాడు. భారీ యుద్ద సన్నివేశం తెరకెక్కించడం నిజమే అని, త్వరలోనే 45 కోట్లతో ఆ సీన్స్‌ చిత్రీకరణకు ఏర్పాట్లు ప్రారంభం అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

syeraaa