ఎట్టకేలకు జాయిన్‌ అయిన చైతూ, సమంత…!

Nagachaitanya And Samantha Tension For Majali Movie

చైతూ, సమంతలు మూడు చిత్రాల్లో కలిసి నటించి హిట్‌ పెయిర్‌గా నిలిచారు. అదే సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి గతేడాది పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లికి ముందు కలిసి ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జంట మరోసారి తెరపై చూడాలని అంతా ముచ్చటపడ్డారు. అందుకు చైతూ, సమంతలు కూడా ఒకే అనుకోని ఒక చిత్రంలో చేయడానికి సిద్దపడ్డారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.

samantha
చైతూ, సమంతలు విదేశాల్లో ఉండగా ఇతర నటీనటులతో చిత్రీకరించారు. తాజగా చైతూ, సమంతలు విదేశాల నుండి తిరిగి రాగ వీరిద్దరి సీన్‌లను తెరకెక్కిస్తున్నారు. తాజగా చైతూ సమంతలు ఈ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. ఈ చిత్రంలో చైతూ, సమంతలు భార్యా భర్తలుగా నటిస్తున్నారు. ఇద్దరి మధ్య కొన్ని ముఖ్యమైన సీన్‌లను తెరకెక్కిస్తున్నారు. భార్యభర్తల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతూ, సమంతలు పెళ్లయ్యాక కలిసి నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది, ఈ చిత్రానికి ‘మజిలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

majili