టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఆయన పరశురాం దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘సర్కారు వారి పాట’. ఆ చిత్రంలో షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. ఈ సమయంలో కొంచెం గ్యాప్ తీసుకున్న ప్రిన్స్ భార్య, పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్‌లో ట్రిప్‌లో ఉన్నాడు.
తాజాగా ఈ ట్రిప్‌లో పిల్లలు సితార, గౌతమ్‌తో కలిసి ఈత కొడుతున్న ఎంజాయ్ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇద్దరితో కలిసి శాంతిని కనుగొన్నట్లు క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే ఆయన భార్య నమ్రతా సైతం ఈ ట్రిప్ సంబంధించి చిన్న వీడియోని షేర్ చేసింది. అందులో సూపర్ స్టార్ తన కూతురితో కలిసి లూసెర్న్‌లో నడుస్తున్నాడు. దీంతో ఇవీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారాయి.