మహేష్ బాబు నమ్రతల జోడికి టాలీవుడ్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వంశీ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం.. ప్రేమ, పెళ్లి వరకు వచ్చింది. మొత్తానికి ఈ మధ్యే మహేష్ బాబు తన పెళ్లి సీక్రెట్లను బాలయ్య షోలో చెప్పేశాడు. ఏదో అలా ప్రైవేట్ ఫంక్షన్‌లా చేసేశామని, ఎవ్వరినీ పిలవలేదని అసలు వ్యవహారం గురించి చెప్పేశాడే. అలా మహేష్ నమ్రతల వివాహాం 2005, ఫిబ్రవరి 10న జరిగింది.
మొత్తానికి వారిది నేడు పదిహేడో వివాహా వార్షి కోత్సం. కానీ నేడు మహేష్ బాబు వైఎస్ జగన్‌ను కలిసేందుకు చిరంజీవితో కలిసి వెళ్లాడు. ఇందులో భాగంగా ఫ్లైట్‌లోనే మహేష్ బాబు విషె చేశాడు చిరంజీవి. టాలీవుడ్ క్యూట్ కపుల్ మీద చిరు కురిపించిన ప్రేమకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే చిరు చూపించిన ప్రత్యేక ప్రేమకు మహేష్ ఎమోషనల్ అయ్యాడు.
మామూలుగానే ఇది ఎంతో మెమోరబుల్.. మీరు దీన్ని మరింత గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా చేశారు. థ్యాంక్స్ సర్ అని చిరు ట్వీట్‌కు మహేష్ బాబు రిప్లై ఇచ్చాడు. పదిహేడేళ్ల బంధం.. ఇందులో ప్రేమ, నవ్వులు, నమ్మకం, గౌరవం, ఓర్పు, సహనం, దయాగుణం ఇలా అన్నీ కలిసి ఉన్నాయి.
ఇంకా మా బంధం బలపడుతూనే ఉందని నమ్రత చెప్పుకొచ్చింది.మరో వైపు తన వివాహా వార్షికోత్సవంపై మహేష్ స్పందించాడు. ఎంతో వేగంగా గడిచింది.. హ్యాపీ యానివర్సరీ నమ్రత. ఇంకా మున్ముందే ఎన్నో ఏళ్లు ఇలా జరుపుకోవాలి అని కోరుకున్నాడు.