మహేశ్ బాబుకు ఓ హిట్ మూవీ బాకీ ఉన్నా : ఎస్​జే సూర్య

మహేశ్ బాబుకు ఓ హిట్ మూవీ బాకీ ఉన్నా : ఎస్​జే సూర్య
Latest News

తమిళ నటుడు, దర్శకుడు.. ఎస్​జే సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. ఆయన దర్శకుడిగానే కాదు నటుడిగానూ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు . తాజాగా విశాల్‌తో కలిసి ఆయన నటించిన మూవీ ‘మార్క్‌ ఆంటొని’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో మహేశ్‌ బాబు గురించి ఆయన ఆసక్తికర కామెంట్స్‌ కూడా చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేశ్ బాబుకు ఓ హిట్ మూవీ బాకీ ఉన్నా : ఎస్​జే సూర్య
S.J Surya

‘‘ఇప్పటి వరకూ దర్శకుడిగా చాలామంది హీరోలకు సూపర్ హిట్‌లు అందించాను. తమిళంలో అజిత్‌, విజయ్‌లతో బ్లాక్‌ బస్టర్‌ మూవీ లు తీశాను. అలాగే తెలుగులోనూ పవన్‌ కల్యాణ్‌తో ‘ఖుషి’ తీసి మంచి విజయాన్ని కూడా అందుకున్నాను. కానీ, మహేశ్‌ బాబుకు మాత్రం ‘నాని’తో ఫ్లాప్ మూవీ ఇచ్చాను. అందుకే ఆయనకు బాకీ పడ్డాను. త్వరలోనే మంచి సినిమా తీసి మహేశ్ బాబు బాకీ తీర్చుకుంటాను’’ అని అన్నారు ఎస్​ జే సూర్య. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ చూసి.. ‘ఏ మూవీ కైనా సీక్వెల్‌ తీస్తారా?’ అంటూ మహేశ్‌ అభిమానులు అడుగుతున్నారు.