అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రిలీజ్

అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రిలీజ్
Movie News

అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురంలో గజదొంగగా పేర్గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. కొత్త దర్శకుడు వంశీ ఈ సినిమా తెరకెక్కుస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రిలీజ్
Ravi Teja ” Tiger Nageswarao “

ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్, ఫస్ట్ లుక్ అదిరిపోయాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రిలీజ్ కానుందని.. దసరా బరిలో మూవీ ఉంటుందని ప్రకటించారు ఈ మూవీ దర్శకుడు. బాలీవుడ్ హీరోయిన్స్ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా కీలక పాత్రలో నటించారంట . చాలా గ్యాప్ తరువాత రేణుదేశాయ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.