50 డేస్ సెలెబ్రేషన్స్ … ఫుల్ జోష్ లో సూపర్ స్టార్

50 డేస్ సెలెబ్రేషన్స్ ... ఫుల్ జోష్ లో సూపర్ స్టార్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతుందని `సరిలేరు నీకెవ్వరు` సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.సంక్రాంతి బరిలో `అల వైకుంఠపురంలో`తో పోటీ పడిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్…అంటూ హిట్ టాక్తో మంచి కలెక్షన్లు రాబట్టింది.

అనిల్ రావిపూడి మహేష్ బాబుల కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు‘ చిత్రం విడుదలై నేటికి 50 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రిన్స్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. `సరిలేరు నీకెవ్వరు`తో తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాత అనిల్ సుంకరలకు మహేష్ బిగ్ హగ్ ఇస్తూ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఎంటైర్ యూనిట్కు ప్రిన్స్ ‘థ్యాంక్స్’ చెప్పాడు. దీంతోపాటు విజయశాంతి రష్మిక రత్నవేలు ప్రకాశ్ రాజ్ దేవీశ్రీ ప్రసాద్ లను మహేశ్ ట్యాగ్ చేశాడు.