ఆర్‌ఆర్‌ఆర్‌ టీజర్‌ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది

ఆర్‌ఆర్‌ఆర్‌ టీజర్‌ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది

దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయో ట్రీట్‌ ఇచ్చారు మూవీ మేకర్స్‌.

ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 45 సెకన్ల పాటు కొనసాగిన ఈ వీడియో రిలీజ్‌ అయిన కాసేపటికే ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా కీరవాణి బీజీఎం బాగా ఆకట్టుకుంటోంది. రోమాలు నిక్కబొడిచేలా రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ స‌హా మిగిలిన న‌టీన‌టుల భారీ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ ఫస్ట్‌ గ్లీంప్స్‌ను బయటకు వదిలారు. తాజాగా ఈ టీజర్‌పై సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు స్పందించారు.

‘వావ్..స్ట‌న్నింగ్‌. అద్బుత‌మైన విజువ‌ల్స్‌తో టీజర్‌ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. వావ్‌ అనకుండా ఉండలేం. ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మరింత ఆసక్తి పెరిగింది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నాడు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది.