మహేష్‌ వ్యాఖ్యలపై విమర్శలు

Mahesh Babu Shocking Answer for Media Questions

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మహేష్‌బాబు తాజాగా నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌ కార్యక్రమంలో మహేష్‌బాబు పాల్గొన్నాడు. నిన్న మీడియా సమావేశంలో మహేష్‌బాబు సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. అదే సమయంలో తన భవిష్యత్తు ప్రణాళికను మరియు ప్లాన్స్‌ను కూడా మహేష్‌బాబు చెప్పుకొచ్చాడు. వరుసగా తాను చేసిన చిత్రాలు ఫెయిల్‌ అయిన కారణంగా ఇకపై ప్రయోగాలకు ఎట్టి పరిస్థితుల్లో ఓకే చెప్పను అని, ఒక వేళ ప్రయోగాలకు ఓకే చెబితే తన తండ్రి కృష్ణ గారి అభిమానులు ఇంటికి వచ్చి మరీ కొట్టేలా ఉన్నారు అంటూ మహేష్‌బాబు వ్యాఖ్యలు చేయడం జరిగింది.

మహేష్‌బాబు చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో ప్రయోగాలకు పెట్టింది పేరు కృష్ణ. అలాంటి కృష్ణ వారసుడు అయ్యి ఉండి ప్రయోగాలకు నో చెప్పడం ఏంటని, దానికి తోడు ప్రయోగాలు చేస్తే ఫ్యాన్స్‌ కొడతారు అంటూ వ్యాఖ్యనించడం ఏంటని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఎప్పుడు కూడా ప్రయోగాలకు మద్దతు తెలుపుతారని, ప్రయోగాలు చేసినంత మాత్రాన అభిమానులు ఈసడిచ్చుకోరు అంటూ మహేష్‌కు సూచిస్తున్నారు. గతంలో మహేష్‌బాబు చేసి ఫ్లాప్‌ అయిన సినిమాలు ప్రయోగాత్మక చిత్రాలు కావని, అవి పనికిమాలిని సినిమాలు అంటూ స్వయంగా కొందరు ఫ్యాన్స్‌ అంటున్నారు. రామ్‌ చరణ్‌ రంగస్థలంలో మాదిరిగా ప్రయోగాత్మకంగా ఒక మంచి సినిమాను చేస్తే, మంచి పాత్రలో నటిస్తే తప్పకుండా ఆధరిస్తామని అభిమానులు అంటున్నారు.